Ayodhya: జనవరి 22న పాఠశాలలు, కళాశాలలకు సెలవు.. రామమందిర ప్రారంభం సందర్భంగా..

| Edited By: Ravi Kiran

Jan 17, 2024 | 8:40 AM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఆ రోజు అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఈ నేపథ్యంలో పీలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 22న రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉండవని సీఎం యోగి తెలిపారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని సూచించారు. అలాగే బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున వేడుక జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఆ రోజు అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఈ నేపథ్యంలో పీలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 22న రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉండవని సీఎం యోగి తెలిపారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని సూచించారు. అలాగే బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున వేడుక జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అయెధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి 4000 మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. ప్రముఖ సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపారవేత్తలకు కూడా ఆహ్వానాలు పంపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos