Viral Video: కోడి- పాము మధ్య భీకర పోరు.. గుడ్లను తినేందుకువచ్చిన పాము.. చుక్కలు చూపించిన కోడి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
తన పిల్లలను కాపాడుకోవడం కోసం మనుషులే కాదు ఏ జీవి అయినా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంటాయి. జంతువులు తమ పిల్లలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా
తన పిల్లలను కాపాడుకోవడం కోసం మనుషులే కాదు ఏ జీవి అయినా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంటాయి. జంతువులు తమ పిల్లలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఒక కోడి తన పిల్లలను కాపాడుకోడానికి పెద్ద పాముతో తలపడుతుంది. వాటి మధ్య జరిగిన యుద్ధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక కోడి తన గుడ్లను పొదుగుతున్న సమయంలో అక్కడికి ఓ ఒక భారీ త్రాచు పాము వచ్చింది. ఆ పాము గుడ్లను మింగాలని వాటి వైపు చూస్తుంది. కోడి కూడా నాగుపాము వైపు చూస్తుంది.. కోడిని భయపెట్టి పారిపోయేలా చేసి ఆ గుడ్లను ఎలాగైనా తినేయాలనేది పాము ప్లాన్. అది గమనించిన కోడి పాము బెదిరింపులకు ఏమాత్రం బెదరలేదు. నాగుపామును ధైర్యంగా ఎదుర్కొంది. పాము కోడి తలపై కాటు వేసేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గకపోగా కోడి తన ముక్కుతో పాము తలపై పొడుస్తుంది.!! అలా పాము, కోడి మధ్య భీకర పోరు జరిగింది. చివరికి పాము ఓడిపోయి వెనక్కి తగ్గడంతో… కోడి పామును దూరంగా తరిమేస్తుంది. అలా తన గుడ్లను కాపాడుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కోడి ధైర్యాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…