Heavy Snowfall: ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.

|

Feb 21, 2024 | 9:43 PM

ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో మెరిసిపోతున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు టూరిస్టులు.

ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో మెరిసిపోతున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు టూరిస్టులు. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర మంచే కనిపిస్తోంది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచులో తడుస్తూ ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. మరోవైపు రహదారులు మంచుతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్‌లో గల సావ్జియాన్‌ సెక్టార్‌లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on