Himachal: హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!

|

Aug 04, 2024 | 10:10 AM

హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు చనిపోగా, 50 మంది గల్లంతయ్యారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమేజ్‌ఖాద్‌లోని హైడ్రో పవర్ ప్రాజెక్టు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. మరోవైపు, అకస్మాత్తు వరదల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం ఉదయం పార్వతి నది సమీపంలోని భవనం కొట్టుకుపోయింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు చనిపోగా, 50 మంది గల్లంతయ్యారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమేజ్‌ఖాద్‌లోని హైడ్రో పవర్ ప్రాజెక్టు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. మరోవైపు, అకస్మాత్తు వరదల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం ఉదయం పార్వతి నది సమీపంలోని భవనం కొట్టుకుపోయింది. వరదల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

క్లౌడ్‌ బరెస్ట్‌లో దాదాపు 50 మంది ఆచూకీ గల్లంతైంది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు, పోలీసులు, హోంగార్డులు సహా ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు డిప్యూటీ కమిషనర్‌ అనుపమ్‌ కశ్యప్‌ వెల్లడించారు. గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు కశ్యప్‌ తెలిపారు. వారి జాడను కనిపెట్టేందుకు డ్రోన్లను సైతం మోహరించినట్లు చెప్పారు. ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఓ జల విద్యుత్తు కేంద్ర సైతం తీవ్రంగా దెబ్బతింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on