వందేళ్లు ప్రేమను పంచిన అమ్మకు ఆత్మీయ సత్కారం
ప్రస్తుత కాలంలో ఎవరైనా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే.. పెద్ద విశేషమే. ఎందుకంటే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది వివిధ రకాల కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. జీవితం అంటేనే ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలతో కూడుకున్నది. వీటన్నిటినీ తట్టుకుని జీవనం ముందుకు సాగించడం ఒక సవాలే. కొందరు జీవన పోరాటం సాగించలేక క్షణికావేశంలో మధ్యలోనే జీవితం ముగిస్తుంటారు.
ప్రస్తుత కాలంలో ఎవరైనా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే.. పెద్ద విశేషమే. ఎందుకంటే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది వివిధ రకాల కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. జీవితం అంటేనే ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలతో కూడుకున్నది. వీటన్నిటినీ తట్టుకుని జీవనం ముందుకు సాగించడం ఒక సవాలే. కొందరు జీవన పోరాటం సాగించలేక క్షణికావేశంలో మధ్యలోనే జీవితం ముగిస్తుంటారు. కానీ ఓ బామ్మ తన జీవన పోరాటంలో విజయం సాధించింది. వందేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆ మాతృమూర్తికి తన కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి సన్మానం చేశారు. వరంగల్ జిల్లా బుధరావుపేటలో పులిగిల్ల లచ్చమ్మ అనే వృద్ధురాలు వంద వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అంతా కలిసి వందేళ్లు తమకు ప్రేమాభిమానాలను పంచిన అమ్మను సత్కరించాలనుకున్నారు. అంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. లచ్చమ్మ కుమారులైన సెక్రటేరియట్ ఉద్యోగి పులిగిల్ల ప్రభాకర్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి లచ్చమ్మను సన్మానించి కృతజ్ఞత చాటుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Thalapathy: మంచి మనసును చాటుకున్న విజయ్ దళపతి
బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా ??
అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్
పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??