Mother Love: అమ్మ ప్రేమకు మరో నిదర్శనం.. అమ్మ ప్రేమకు క్రియేటివిటీ తోడైతే ఇలాగే ఉంటుందంటున్న నెటిజనం..

తల్లి తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. వారిని నిత్యం సంతోషంగా ఉంచేందుకు ఏమైనా చేస్తుంది. ఈనేపథ్యంలో అమ్మ ప్రేమ, ఆమె సృజనాత్మకతకు

Mother Love: అమ్మ ప్రేమకు మరో నిదర్శనం.. అమ్మ ప్రేమకు క్రియేటివిటీ తోడైతే ఇలాగే ఉంటుందంటున్న నెటిజనం..

|

Updated on: Oct 05, 2022 | 9:27 AM


తల్లి తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. వారిని నిత్యం సంతోషంగా ఉంచేందుకు ఏమైనా చేస్తుంది. ఈనేపథ్యంలో అమ్మ ప్రేమ, ఆమె సృజనాత్మకతకు సంబంధించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో.. ఓ తల్లి సైకిల్‌పైన పనికి వెళ్తుంది. అయితే తనకు ఒక చిన్న బిడ్డ కూడా ఉన్నాడు. ఆ బిడ్డను సైకిల్ వెనుక సీటుపైన ఒక కుర్చీ ఏర్పాటు చేసి అందులో ఎంతో జాగ్రత్తగా బిడ్డను కూర్చోబెట్టుకుని వెళ్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. అమ్మ ప్రేమకు హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.సమాజంలో ఎంతో మంది తల్లులు పనులకు వెళ్లేటప్పుడు తమ పిల్లలను భుజాన మోసుకెళుతూ ఉంటారు. ఇక వలస కూలీలైతే రోజుల తరబడి కిలోమీటర్ల పాటు పిల్లలను మోసుకెళ్తూ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తన ప్రేమకు కాస్త సృజనాత్మకతను జోడించి తయారుచేసిన ఈ కుర్చీ సైకిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో ఎలాంటి సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుందని నిరూపించే ఈ 9 సెకన్ల వీడియోను మిలియన్లమంది వీక్షించారు. వేలమంది లైక్‌ చేస్తూ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రపంచంలోని చాలా ఆవిష్కరణలు అమ్మ ప్రేమతో మొదలైనవే.. అమ్మ ప్రేమకు క్రియేటివిటీ తోడైతే ఇలాంటి అద్భుతాలే ఆవిష్కృతమవుతాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us