Lemon Grass: లెమన్‌ గ్రాస్‌తో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టారు..

|

Jun 10, 2024 | 10:37 AM

మ్మ గడ్డి సహజమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీకు రిఫ్రెష్‌గా అనిపించడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని మీ ఇంట్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు. లెమన్ గ్రాస్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మానసిక స్థితిని మెరుగుపరచడంలో నిమ్మగడ్డి బాగా పనిచేస్తుంది. దీని సువాసన వేసవిలో తరచూ వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది.

నిమ్మ గడ్డి సహజమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీకు రిఫ్రెష్‌గా అనిపించడంతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని మీ ఇంట్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు. లెమన్ గ్రాస్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మానసిక స్థితిని మెరుగుపరచడంలో నిమ్మగడ్డి బాగా పనిచేస్తుంది. దీని సువాసన వేసవిలో తరచూ వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. దీని నూనె ఆయిల్ డిఫ్యూజర్‌లో ఉంచితే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతుంది. లెమన్ గ్రాస్‌తో టీ తయారు చేసి తాగవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఉబ్బరం, తిన్న తర్వాత అజీర్ణం వంటి సాధారణ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. లెమన్ గ్రాస్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మంతో బాధపడేవారు తమ చర్మ సంరక్షణలో నిమ్మ గడ్డిని ఉపయోగించవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, సహజ ప్రక్షాళనగా పనిచేస్తుంది. ఈ నీళ్లతో ముఖం కడుక్కోవచ్చు లేదా గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని మీరు ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.