అయోధ్య రాముణ్ణి చూపిస్తూ మెదడుకు ఆపరేషన్‌.. గుంటూరు వైద్యుల ఘనత

|

Feb 22, 2024 | 8:26 PM

అయోధ్య బాలరాముడిని చూపించి మెదడులో కణితిని తొలగించారు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు. కుడిచేయి, గొంతు, మాటల తీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో ఉన్న కణతిని తొలగించే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను రోగికి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ విజయవంతంగా పూర్తిచేశారు. గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి ఆసుపత్రి వైద్యులు విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

అయోధ్య బాలరాముడిని చూపించి మెదడులో కణితిని తొలగించారు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు. కుడిచేయి, గొంతు, మాటల తీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో ఉన్న కణతిని తొలగించే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను రోగికి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ విజయవంతంగా పూర్తిచేశారు. గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి ఆసుపత్రి వైద్యులు విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఫలితం లేకపోవడంతో చివరికి శ్రీసాయి ఆసుపత్రిని సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు మెదడులోని అత్యంత కీలక ప్రాంతంలో 7 సెంటీమీటర్ల పరిమాణంలో కణతిని గుర్తించారు. దీనిని తొలగించాలంటే రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్‌ చేయాలి. ఈ క్రమంలో రోగిని మెలకువగా ఉంచేందుకు వైద్యులు అయోధ్యబాలరాముడిని ఎంచుకున్నారు. ఫిబ్రవరి 11న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మణికంఠకు టీవీలో అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూపిస్తూ విజయవంతంగా కణతిని తొలగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vladimir Putin: కిమ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పుతిన్.. అదేంటంటే ??

TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్‌ కేసులో బయటపడ్డ సంచలన నిజం