AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామంలో ఎవరి ఇంట్లో వంట చేసుకోరు.. సర్పంచ్ ఐడియా అదుర్స్ వీడియో

ఆ గ్రామంలో ఎవరి ఇంట్లో వంట చేసుకోరు.. సర్పంచ్ ఐడియా అదుర్స్ వీడియో

Samatha J
|

Updated on: May 09, 2025 | 5:06 PM

Share

మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు వృద్ధులకు ఆసరాగా ఉంటూ చివరి మజిలీలో వెంట నిలుచుండేది. అయితే, న్యూక్లియర్ కుటుంబాల మార్పుతో ప్రస్తుతం వయసు మీద పడ్డ వారిని ఒంటరితనం వేదిస్తోంది. పిల్లలతో కలిసి నగరాల్లో ఇరుకు ఇళ్లల్లో ఉండలేక గ్రామాల్లో ఉంటున్న వారు రోజువారి పనులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పనుల కోసం నగరానికి వలస వెళ్ళిన యువత వారి పోషణకు డబ్బులు పంపిస్తారు. ఆయినా వృద్ధులు తమ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు గమనించిన ఓ గ్రామ సర్పంచ్ వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టారు. దీనికి ఇప్పుడంతా సలాం కొడుతున్నారు. గుజరాత్ లో ఆ గ్రామంలో సర్పంచ్ చొరవతో ఆ ఊరివాళ్లు తలారాతులు మారిపోయాయి. ఆ ఊర్లో ఎవరూ కూడా తమ ఇంట్లో ఆహారం ఉడికించుకోరు.ఎందుకో తెలుసుకుందాం ఈ స్టోరీలో.

 తల్లిదండ్రులను కనిపించే దేవుళ్ళుగా నిన్నటి తరం పూజించేవారు. అది ఇప్పుడు క్రమంగా కనుమరుగైపోయింది. బాధ్యతారాహిత్యం పెరుగుతూ పండుటాకులపై శ్రద్ధ తగ్గుతోంది. ఊరుకుల పరుగులతో సాగే బతుకు పోరాటంలో పెద్దలు యోగక్షేమాలని పిల్లలు పట్టించుకోవడం లేదు. స్మార్ట్ ఫోన్ల మాయతో కుటుంబ బంధాలకు దూరమవుతున్నారు. అభిమానంతో మాట్లాడే నాలుగు మాటల కంటే ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్ లు, చాటింగ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువగా సంపాదనకే ప్రాధాన్యత ఇవ్వడంతో పేరెంట్స్ కు, పిల్లలకు మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి. మన దేశంలో వృద్ధులు 12 కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి 2019లో ప్రకటించింది. వీరిలో 300 మంది గ్రామీణ భారతంలో నివసిస్తున్నారు. అందులో సగం మంది పేదరికంతో సతమతమవుతున్నారు. గుజరాత్ లోని ఈ గ్రామం పేరు చందన్ కి. కుటుంబ వ్యవస్థలో మార్పులతో చాలామంది వృద్ధులు గ్రామంలో ఒంటరిగా ఉన్నారు. 20 ఏళ్లు న్యూయార్క్ లో పనిచేసిన గ్రామ సర్పంచ్ పూనంబాయి పటేల్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అయితే, ఈ క్రమంలోనే తన ఊరిలోని పరిస్థితులను గమనించగా ఎక్కువ మంది వృద్ధులు కనిపించారు. దీనికి ప్రధాన కారణం యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్ళడం అని గుర్తించారు. వృద్ధాప్యంతో వంట వండుకోలేని స్థితిలో ఉన్న గ్రామస్తులను చూసి వారి జీవన విధానాన్ని మెరుగుపరచాలనుకున్నారు పూనంబాయి. గ్రామ సర్పంచ్ గా ఓ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం :

డేగాకు పాస్ పోర్ట్.. ఏ దేశం ఇచ్చిందంటే వీడియో

బస్సును ఢీ కొట్టిన బైక్..సీన్ కట్ చేస్తే వీడియో

షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే అధిక ప్రోటీన్ వీడియో