డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి

|

Mar 11, 2024 | 5:00 PM

ఆకాశమంత పందిరి, భూదేవంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వారి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్‌’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు.

ఆకాశమంత పందిరి, భూదేవంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వారి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్‌’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పి ఉండే స్పితి లోయలో వివాహం చేసుకున్నారు. ఒక పక్క మంచు పూల వర్షమే అక్షింతలుగా చలికి వణికి పోతూ మంచులో ముచ్చటగా పెళ్లి చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఫోటోషూట్‌కు వచ్చిన కెమెరామెన్లు, బంధువులు, పంతుళ్లు ఇలా అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. పెళ్లికి సంబంధించిన వీడియోలను హిమాచల్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్, గో హిమాచల్ ట్విటర్‌ ఖాతాలో షేర్ అయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు

సోదరి ఎగ్జామ్​ కోసం సాహసం.. మంచులో ‘రోడ్డు’ వేసిన సోదరుడు

200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్‌ తిన్న శాస్త్రవేత్తలు