Suicide Attempt: ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం.. పెళ్లి మండపంలో నిప్పంటించుకుని ప్రియుడి..
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం జరగడంతో ప్రియుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం జరగడంతో ప్రియుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రియురాలికి వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకే వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్‌హౌజ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఆశ్వక్, స్థానికంగా ఉన్న ఫాతిమాను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయం కుటుంబ పెద్దలకు తెలియడంతో ఫాతిమాకు మరొకరితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు లంగర్‌హౌస్‌లోని మొగల్ ఫంక్షన్ హాల్‌లో ఫాతిమాకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. విషయం తెలిసిన ఆశ్వక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు వెళ్లి.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలార్పి, అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

