Groom Funny Dance: ఇదేం డ్యాన్స్‌రా నాయనా.. దుమ్మురేపిన పెళ్లికొడుకు..! చూస్తున్నంత సేపు నవ్వుతారు..

|

Nov 06, 2022 | 5:51 PM

పెళ్లి అంటే సందడే సందడి.. బోలెడంత హడావుడి. బంధుమిత్రులు అంతా వచ్చి తెగ సందడి చేసేస్తారు. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురుని ఓ వారం రోజుల పాటు సెలబ్రిటీలుగా చూస్తారు. పెళ్లి పూర్తయ్యేంత వరకూ వాళ్లకు స్పెషల్ స్టేటస్ ఉంటుంది.


పెళ్లి తరవాత జరిగే “బరాత్” తంతులోనూ వరుడు, వధువులదే హవా. వాళ్లు డ్యాన్స్ చేయకుండా అటు ఫ్రెండ్స్ ఇటు రిలేటివ్స్ వదిలిపెట్టరు. కచ్చితంగా కాలు కదపాల్సిందేనని పట్టు పడతారు. ఆ మధ్య “బుల్లెట్టు బండి” పాటకు డ్యాన్స్ చేసి ఓ నవ వధువు ఎంత ఫేమస్ అయిందో చూశాం. ఇప్పుడు ఓ వరుడు కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. కాకపోతే.. ఈ స్టెప్‌లు కాస్త విచిత్రంగా ఉన్నాయనుకోండి. మొత్తానికి ఇరగదీసిండనే చెప్పాలి… బ్యాండ్ వాళ్లు మ్యూజిక్ మొదలెట్టగానే ఫన్నీగా డ్యాన్స్ చేశాడు ఓ వరుడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ చూసి చుట్టూ ఉన్న మహిళలు కూడా గట్టిగా నవ్వుకున్నారు. మనోడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన స్టెప్‌లు వేసేశాడు. ఓ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే వైరల్ అయిపోయింది. దీంతో “అదేం డ్యాన్స్‌రా నాయనా” అంటూ నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 06, 2022 05:51 PM