Bride delivery: పెళ్లిపీటలపైనే పురిటి నొప్పులు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వధువు.! వీడియో.
పెళ్లిపీటలపైనే వధువుకు పురిటి నొప్పులొచ్చాయి. వినేందుకు కాస్త ఆశ్చర్యంగా వున్నా మీరు విన్నది నిజమే. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే..
పెళ్లిపీటలపైనే వధువుకు పురిటి నొప్పులొచ్చాయి. వినేందుకు కాస్త ఆశ్చర్యంగా వున్నా మీరు విన్నది నిజమే. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలోనే ముందే శారరీకంగా కలుసుకున్నారు. దీంతో ప్రియురాలు గర్భం దాల్చింది. వివాహ వేడుక రోజునే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నెదర్లాండ్స్ లోని డోడ్రెట్చ్ సిటీకి చెందిన నికోల్, మార్క్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారరీకంగా దగ్గరయ్యారు. దీంతో నికోల్ గర్భం దాల్చింది. అయితే, వివాహం జరిగిన తర్వాతే పిల్లలను కనాలన్న ఆలోచన రావడంతో.. పెళ్లి తర్వాతే డెలివరీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు వివాహ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అక్టోబర్ 26వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.వివాహ వేదిక వద్ద నికోల్, మార్క్ కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నికోల్, మార్క్ పెళ్లికి సిద్ధమయ్యారు. అంతలోనే వధువుకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తేదీ కంటే ఐదు వారాల ముందే నికోల్ ప్రసవించింది. సరిగ్గా పెళ్లి రోజే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ నూతన వధూవరులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే పెళ్లి మండపం నుంచి అతిథులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. వివాహం జరిపించే మత పెద్దలు కూడా అక్కడికే వచ్చేశారు. ఆస్పత్రిలోని ప్రార్థనా మందిరంలో నికోల్, మార్క్ వివాహం జరిపించారు. వీరి వివాహ రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరిగింది. పెళ్లి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నికోల్, మార్క్ దంపతులకు అతిథులు డబుల్ కంగ్రాట్స్ చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

