అరరే… ఈ పెళ్లికొడుకు కష్టాలు ఎవరికీ రాకూడదు.. వరుడ్ని ముప్పుతిప్పలు పెట్టిన ??
పెళ్లంటే ఆ సందడే వేరు. వధూవరులనుంచి బంధుమిత్రుల వరకూ ఆ పెళ్లిలో తాము ఎంతో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. వీళ్ల ఆసక్తిని ఆసరాగా తీసుకొని వీడియో, ఫోటో గ్రాఫర్లు వాళ్లను ఓ రేంజ్‌లో ఆడుకుంటారు.
పెళ్లంటే ఆ సందడే వేరు. వధూవరులనుంచి బంధుమిత్రుల వరకూ ఆ పెళ్లిలో తాము ఎంతో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. వీళ్ల ఆసక్తిని ఆసరాగా తీసుకొని వీడియో, ఫోటో గ్రాఫర్లు వాళ్లను ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. తమ ట్యాలెంట్ అంతా ఉపయోగించి వారిని రకరకాలా యాంగిల్స్‌లో కవర్ చేస్తారు. అంతేకాదు వాళ్లు ఎలా ఫోజులివ్వాలోకూడా డైరెక్ట్ చేస్తుంటారు. అలా ఓ ఫోటోగ్రాఫర్ వేదికపై ఉన్న వరుడికి చుక్కలు చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ జంట రిసెప్షన్ వేడుక జరుగుతోంది. వేదికపై అందరూ చూస్తుండగానే వరుడు, వధువుకి ప్రపోజ్ చేయాలి. మోకాలుమీద కూర్చొని, పూల బొకేని ఇస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలి. అదే ఆ పెళ్లి కొడుక్కి పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంత ట్రై చేసినా అతనికి మోకాళ్లపై కూర్చోవడం రావట్లేదు. చివరకు ఫోటోగ్రాఫర్ వచ్చి.. అలా కాదు ఇలా ప్రపోజ్ చేయండి అంటూ డైరెక్షన్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు ప్రయత్నాలను చూసి ఆ పెళ్లి కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుత్వ పెన్షన్ కోసం అంధురాలిగా మారిన మహిళ !!
వామ్మో.. ఇదేం లొల్లి! మత్తులో మచ్చెమటలు పట్టించింది
చిలుక ఆస్కార్ పెర్‌ఫార్మెన్స్.. వీడియో చూసి తీరాల్సిందే
తాగి నడిపినందుకు తిక్క కుదిరింది !! ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

