చిలుక ఆస్కార్ పెర్‌ఫార్మెన్స్.. వీడియో చూసి తీరాల్సిందే
పెంపుడు జంతువులు వాటి యజమానులు ఏవి నేర్పిస్తే అవి చక్కగా నేర్చుకుంటాయి. ఇందులో కుక్కలు, చిలుకలు ముందు వరుసలో ఉంటాయి. తాజాగా ఓ చిలుక తన అద్భుతమైన యాక్టింగ్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
పెంపుడు జంతువులు వాటి యజమానులు ఏవి నేర్పిస్తే అవి చక్కగా నేర్చుకుంటాయి. ఇందులో కుక్కలు, చిలుకలు ముందు వరుసలో ఉంటాయి. తాజాగా ఓ చిలుక తన అద్భుతమైన యాక్టింగ్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓగ్రీన్ కలర్ చిలుక కనిపిస్తోంది. దానికి పక్కనే ఓ చిన్న స్టాండ్‌పైన తుపాకీ ఉంది. ఈ చిలుక యజమాని ఆ తుపాకీని తనకు తెచ్చి ఇవ్వమని సైగ చేసాడు. అంతే వెంటనే చిలుక తన ముక్కుతో ఆ తుపాకీ తెచ్చి తన యజమాని చేతిలో పెట్టింది. వెంటనే అతను దాంతో చిలుకను షూట్ చేశాడు. వెంటనే ఆ చిలుక నేల కూలింది. అయ్యో ఇదేం పనీ.. చిలుకను అన్యాయంగా చంపేసాడే అనుకుంటే పొరపాటే.. ఆ తుపాకీ బొమ్మ తుపాకీ. చిలుక యజమాని చిలుకను షూట్ చేసినట్టు బెదిరిస్తే, చిలుక తనకు బుల్లెట్ తగిలినట్టు.. దాంతో తాను చనిపోయినట్టు యాక్ట్ చేసింది. ఈ చిలుక యాక్టింగ్‌కి నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. ఈ వీడియోను 24 వేల మందికి పైగా లైక్ చేసారు. చిలకమ్మా… నీ పెర్‌ఫార్మెన్స్‌కి ఆస్కార్ కూడా తక్కువే అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాగి నడిపినందుకు తిక్క కుదిరింది !! ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందంటే ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

