Viral Video: గిరిజన యువకుడి రోల్స్ రాయిస్.. చూస్తే షాకవుతారు అంతే.! వీడియో..

|

Apr 10, 2024 | 8:14 AM

అవసరానికి తగినట్టుగా అప్పటికప్పుడు జుగాడ్‌ లు సృష్టించడం భారతీయులకే చెల్లింది. ఓ గిరిజన యువకుడు సృష్టించిన జుగాడ్‌ తన నానమ్మ పాలిట రోల్స్‌ రాయిస్‌ కారులా మారింది. అవును నడవలేని, కనీసం కూర్చుని ఎక్కువ దూరం ప్రయాణించలేని స్థితిలో ఉన్న తన నానమ్మను బ్యాంకుకు తీసుకెళ్లడం కోసం ఆమె మనవడు పడిన తపన అందరినీ ఆకట్టుకుంటోంది. వృద్ధాప్యంలో ఆ వృద్ధురాలికి అండగా నిలిచిన యువకుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ చోరుపల్లి అనే గిరిశిఖర గ్రామంలో మండంగి చిన్నమ్మి అనే 75 సంవత్సరాల వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఈమెకు కళ్లు సరిగా కనిపించవు. వృద్ధాప్యం కారణంగా సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. ఆ గ్రామం నుండి ఏ చిన్నపాటి అవసరం ఉన్నా మైదాన ప్రాంతానికి రాక తప్పదు. గ్రామస్తులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడి మోటార్ సైకిల్ వెళ్లగలిగే రహదారిని గ్రామానికి ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు, రప్పలతో ఉన్న ఆ రహదారిలో బైక్ ప్రయాణం కూడా అతికష్టం మీద చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో సరిగా కూర్చోలేని ఆ బామ్మ తన పెన్షన్‌ డబ్బుకోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ మె పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె మనవడు ఆమెకు అండగా నిలిచాడు. నానమ్మ కోసం ఓ వాహనాన్ని తయారు చేశాడు. తన వద్ద ఉన్న పాత మోటర్ సైకిల్ చక్రాలు ఒక పట్టె మంచానికి బిగించి తాళ్ళతో బలంగా కట్టి ఒక ట్రాలీలా తయారు చేశాడు. ఆ ట్రాలీలో కూర్చుంటే తన నాయనమ్మకు ఎండ తగులుతుందని ట్రాలీ పైన కర్రల సహాయంతో ఒక దుప్పటి ఏర్పాటుచేశాడు. అలా తయారు చేసిన ఆ ట్రాలీని తన మోటార్ సైకిల్ వెనుక తగిలించి నాయనమ్మని తీసుకొని కురుపాం బ్యాంక్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బ్యాంక్‎లో నగదు విత్ డ్రా చేసుకొని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడు. తనకు నాయనమ్మపై ఉన్న ప్రేమాభిమానాలే ఈ వాహనం తయారీకి పూనుకునేలా చేసిందని, ఈ ట్రాలీ సహాయంతో తన నాయనమ్మకు కావలసిన అవసరాలు తీరుస్తాను అంటున్నాడు సంతోషంగా చెబుతున్నాడు మనువడు మండంగి శివ. వృద్ధురాలిపై మనవడి ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు. యువకుడిని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..