గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

Updated on: Jan 06, 2026 | 5:39 PM

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్థరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మందుబాబు ఆలయ గోపురంపైకి ఎక్కి కలశాలు, విద్యుత్ దీపాలను ధ్వంసం చేశాడు. కిందికి దిగాలంటే మద్యం కావాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది మూడు గంటలు శ్రమించి అతన్ని కిందకు దించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన భక్తులను షాక్‌కు గురిచేసింది.

తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్‌చల్ చేశాడు. స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసిన తర్వాత విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం గుండా లోనికి ప్రవేశించి ఆలయ గోపురం పైకెక్కి నానా హంగామా చేశాడు. అక్కడున్న కలశాలు, విద్యుత్ దీపాలు స్వల్పంగా ధ్వంసం చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆలయ గోపురం పైకెక్కి తాను కిందికి దిగాలంటే మద్యం బాటిల్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. విజిలెన్స్, తిరుపతి ఈస్ట్, పోలీసులు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి, కిందికి దిగాలని అతనికి ఎంత చెప్పినా గోపురం పైన కూర్చుని కిందికి దిగడానికి నిరాకరించాడు. పోలీసులు విజిలెన్స్ సిబ్బందికి అతనిని కిందికి దించడం మూడు గంటలు పట్టింది. మూడు గంటల పాటు నానా హంగామా చేసిన వ్యక్తిని ఎట్టకేలకు కిందికి దించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు షాక్ తిన్నారు. అయితే ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ

మాలీవుడ్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్‌ హీరో

Yash: బర్త్ డే గిఫ్ట్.. టాక్సిక్‌ ట్రైలర్‌ రెడీ అవుతోందా

పరాశక్తికి దళపతి గ్రీన్‌ సిగ్నల్‌.. పొంగల్ రేసులో రెండు తమిళ చిత్రాలు

స్టార్‌ హీరోలతో పోటీ.. నవీన్‌ అండ్‌ శర్వా గట్స్ ఏంటి ??