Govt Job Mother Son: తల్లీ కుమారుడికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం.! ఈ అద్భుత ఘటన ఎక్కడో తెలుసా..
కేరళలో తల్లీకుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన అరుదైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. మూడుసార్లు ఇద్దరూ కలిసి పోటీ పరీక్షలకు హాజరైనా విజయం దక్కకపోయినా నిరాశ చెందలేదు.
కేరళలో తల్లీకుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన అరుదైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. మూడుసార్లు ఇద్దరూ కలిసి పోటీ పరీక్షలకు హాజరైనా విజయం దక్కకపోయినా నిరాశ చెందలేదు. చివరకు నాలుగోసారి తల్లీకొడుకులు గట్టి ప్రయత్నమే చేసి కొలువు సాధించారు. దీంతో ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి అవుతోంది.
బిందు మాట్లాడుతూ.. తన కుమారుడు పదో తరగతిలో ఉండగా అతడిని ప్రోత్సహించేందుకు తానూ చదవడం మొదలు పెట్టానని తెలిపారు. ఆ తర్వాత పోటీ పరీక్షల కోసం ఓ కోచింగ్ సెంటర్‌లో చేరానని చెప్పారు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత తన కుమారుడ్ని సైతం అదే కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కావడమే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా స్పష్టంచేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తనను స్నేహితులు, కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ, కుమారుడు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు.
బిందు కుమారుడు మాట్లాడుతూ… అమ్మతో కలిసి చదువుకునే సమయంలో ఇద్దరం వివిధ అంశాలపై చర్చించుకునే వాళ్లమని తెలిపాడు. ఇంతకు ముందు తనకు పోలీస్ ఉద్యోగం త్రుటిలో తప్పిపోయిందని, ప్రస్తుత ఉద్యోగానికి ఆరు నెలల ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టానని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు
లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు

