OTT Platforms: అశ్లీల కంటెంట్ ఉన్న 18 OTTలు , 57 సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్.!
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. దేశంలో పబ్లిక్ యాక్సెస్ ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. తాజాగా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. దేశంలో పబ్లిక్ యాక్సెస్ ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. తాజాగా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్‌ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. అయితే, కేంద్రం హెచ్చరికలను ఆ ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోలేదు. దీంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వాటిపై వేటు వేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్‌లో 7 ఆప్స్, యాప్‌స్టోర్‌లో మూడు ఆప్స్ ఉన్నాయి.
కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డ్రీమ్స్ ఫిల్మ్స్, అన్‌కట్ అడ్డా, వూవీ, యేస్మా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియోన్ ఎక్స్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్ తదితర ఓటీటీలు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో న్యూడ్ కంటెంట్ ఎక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. Technology Act, 2000లోని నిబంధనల ప్రకారం ఇది నేరంగా పరిగణించి చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.