స్విగ్గీ ఆర్డర్లో మరో ఘోరం.. ఈసారి ఫుడ్‌లో డేంజరస్ టుబాకో ప్రొడెక్ట్

|

Nov 19, 2023 | 8:46 PM

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆహారం వండుకోడానికి, తినటానికి కూడా తీరిక ఉండటంలేదు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ఇలాంటివారికి వరంలా మారింది. ఆకలి వేయగానే ఆన్‌లైన్‌లో నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. క్షణాల్లో ఆహారం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అయితే ఈ ఆన్‌లైన్‌లో సరఫరా చేసే ఆహారం నాణ్యత లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా.

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆహారం వండుకోడానికి, తినటానికి కూడా తీరిక ఉండటంలేదు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ఇలాంటివారికి వరంలా మారింది. ఆకలి వేయగానే ఆన్‌లైన్‌లో నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. క్షణాల్లో ఆహారం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అయితే ఈ ఆన్‌లైన్‌లో సరఫరా చేసే ఆహారం నాణ్యత లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా. ఆహారంలో రకరకాల క్రిమి, కీటకాలు, ఇనుప వస్తువులు కనిపించిన సంఘటనలు ఎన్నో నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఫుడ్‌లో మత్తుపదార్ధం దర్శనమిచ్చింది. కోయంబత్తూరులోని గౌండంపాళ్యంలో జాస్మిన్‌ అనే మహిళ స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. డెలివరీ బాయ్‌ పార్శిల్‌ తీసుకొచ్చాడు. పార్శిల్‌ విప్పి ఆహారాన్ని జాస్మిన్‌ తన కుమార్తెకు అందించింది. ఫుడ్ తిన్న కాసేపటికి బాలికకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అనుమానం వచ్చి ఆహారాన్ని పరిశీలించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన కూల్‌లిప్‌ ముక్కలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు

సెల్ఫీ కోసం వెళితే చెంప ఛెళ్లుమనిపించిన హీరో

వాని చేతులు విరిగిపోను.. నా బంగారం కొట్టేసిండు

Revanth Reddy: సభకు వచ్చినోళ్లను కూర్చోమని బతిమలాడిన రేవంత్ రెడ్డి

యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు