Watch Video: చట్టం అంటే భయం లేదు.. పట్టపగలు కారులోంచి పిస్టల్ చూపిన వ్యక్తి..!

Watch Video: చట్టం అంటే భయం లేదు.. పట్టపగలు కారులోంచి పిస్టల్ చూపిన వ్యక్తి..!

Janardhan Veluru

|

Updated on: Nov 19, 2023 | 8:09 PM

యూపీలో శాంతి భద్రతల సమస్య మరోసారి తెరమీదకు వచ్చింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు చర్యలు తీసుకుంటున్నా రౌడీ షీటర్లు, గూంఢాలు తరచూ రెచ్చిపోతూనే ఉన్నారు. తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా పట్టపగలు రోడ్డుపై నడుస్తున్న కారులో నుంచి ఓ వ్యక్తి పిస్టల్ చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూపీలో శాంతి భద్రతల సమస్య మరోసారి తెరమీదకు వచ్చింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు చర్యలు తీసుకుంటున్నా రౌడీ షీటర్లు, గూంఢాలు తరచూ రెచ్చిపోతూనే ఉన్నారు. తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టపగలు రోడ్డుపై నడుస్తున్న కారులో నుంచి పిస్టల్ చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిస్టల్‌ని ఇతర కారు డ్రైవర్లకు చూపిస్తూ పక్కకు వెళ్లమని సైగ చేస్తున్నాడు కారులో ఉన్న ఆ వ్యక్తి. ఢిల్లీ – మీరట్ జాతీయ రహదారి NH 24పై ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్ సమీపంలో దీన్ని చిత్రీకరించిన ఓ వాహనదారుడు.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

యుపిలో శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దంపడుతోందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చట్టం అంటే భయంలేని వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఘజియాబాద్ డిసిపి సిటీ కమిషనరేట్ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ విజయనగర్‌ను ఆదేశించినట్లు తెలిపింది.

Published on: Nov 19, 2023 08:08 PM