200 మేకలను నియమించుకున్న గూగుల్ ఎందుకంటే వీడియో
గూగుల్ లోనియా మకాలు అంటే అంత ఆశామాషి ఏం కాదు. కానీ ఒక్కసారి నియామకం అయితే జీవితం సెటిల్ అంటారు టెక్కీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఫ్రెషర్స్ గూగుల్ లో ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటే గూగుల్ మాత్రం మేకలను నియమించుకొని ఆశ్చర్యపరుస్తుంది. అవును మీరు వింటున్నది నిజమే. ప్రఖ్యాత టెక్ సంస్థ గూగుల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్స్ కోసం 200 మేకలను నియమించుకుంది.
అయితే ఇదేదో సాఫ్ట్వేర్ జాబ్ కోసం మాత్రం కాదండి.క్యాంపస్ ఆవరణలో పెరిగిన గడ్డి కలుపు మొక్కలను తిని గ్రౌండ్ శుభ్రం చేయడానికి అట. 26 ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్ లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి మంటలు అంటుకునే ప్రమాదం ఉందట. గతంలో పనివాళ్ళని నియమించి లాన్ మోవర్ల సాయంతో ఆ ప్రాంతాన్ని గూగుల్ శుభ్రం చేయించేది. అయితే 2009 నాటి నుంచి సరికొత్త ఆలోచన చేసిన గూగుల్ ప్రతి వసంత కాలంలో మేకలను నియమించుకుంటోంది. పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్ ఇంధనం వాడకాన్ని లాన్ మోవర్లు చేసే శబ్ద కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వీడియోల కోసం :
సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో
70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
