గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి.. రైలు పట్టాలపైకి కారును పోనిచ్చాడు.. ఏం జరిగిందంటే..

Updated on: Apr 17, 2025 | 6:38 PM

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి ఘోర రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రైలు పట్టాల పైకి కారును నడిపి ఇరుక్కుపోయాడు. అతని కారు పట్టాల పక్కన ఉన్న కంకరలో చిక్కుకుంది. కొన్ని క్షణాల తర్వాత, ఒక గూడ్స్ రైలు అదే ట్రాక్‌పైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుండి బీహార్‌లోని తన గ్రామానికి కారులో బయలుదేరాడు ఓ వ్యక్తి.

డోమిన్‌గఢ్ సమీపంలో అతని కారు పట్టాల పక్కన ఉన్న కంకరలో ఇరుక్కుంది. అదృష్టవశాత్తూ, లోకో పైలట్ కారును సకాలంలో గుర్తించి, అత్యవసర బ్రేక్‌ను లాగడంతో, వాహనానికి 5 మీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో బండి నడిపిపట్లు గుర్తించారు. గూగుల్ మ్యాప్స్‌లో పూర్తి చిరునామాకు బదులుగా తన గ్రామం పేరును మాత్రమే నమోదు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. GPS సూచనలను అనుసరిస్తూ, డోమిన్‌గఢ్ లో రైల్వే పట్టాల వద్దకు చేరుకున్నాడు. కారు ముందు చక్రం ట్రాక్ పక్కన వదులుగా ఉన్న కంకరలో చిక్కుకుని కారు ఆగింది. వెంటనే, సహజన్వా నుండి ఒక రైలు ట్రాక్ పైకి వచ్చింది. లోకో పైలట్ సకాలంలో స్పందించి వేగంగా వస్తున్న రైలును నిలిపివేశాడు. ఆర్పీఎఫ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కారును తొలగించి, ట్రాక్‌ను క్లియర్ చేసింది. రైలు దాదాపు 57 నిమిషాలు ఆలస్యమైంది. కానీ అదృష్టవశాత్తూ, ఆ సమయంలో మరే ఇతర రైళ్లు రాలేదు. దర్యాప్తులో ఘటన జరిగిన సమయంలో ఆదర్శ్ మద్యం సేవించి ఉన్నాడని RPF గుర్తించింది. అతన్ని అక్కడికక్కడే అరెస్టు చేసి, అతని కారును స్వాధీనం చేసుకున్నారు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను

పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి

బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు సెట్లోనే స్టార్‌ హీరో వేధింపులు

30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??

విక్రమ్‌ కొడుకుకు అనుపమ లిప్‌ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్