82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డ
హాలీవుడ్ సీనియర్ నటుడు, గాడ్‌ఫాదర్ చిత్రాలతో అభిమానులను అలరించిన అల్ పాసినో 8 పదుల వయసులో తండ్రి కాబోతున్నారు. 82 ఏళ్ల అల్ పాసినో 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి మీడియాకు తెలిపారు.
హాలీవుడ్ సీనియర్ నటుడు, గాడ్‌ఫాదర్ చిత్రాలతో అభిమానులను అలరించిన అల్ పాసినో 8 పదుల వయసులో తండ్రి కాబోతున్నారు. 82 ఏళ్ల అల్ పాసినో 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి మీడియాకు తెలిపారు. నిర్మాతగా కొనసాగుతున్న నూర్‌తో పాసినోకు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ అయిన వెంటనే అల్ఫాల్లాతో పాసినో డేటింగ్ ప్రారంభించినట్టు వార్తలు వచ్చాయి. గతేడాది ఏప్రిల్‌లో ఈ జంట కాలిఫోర్నియాలోని వెనిస్‌లోని ఫెలిక్స్ రెస్టారెంట్‌లో జంటగా కనిపించడంతో డేటింగ్ ఊహాగానాలకు బలం చేకూర్చింది. గత నెలలో పాసినో స్నేహితుడు బెన్నెట్ మిల్లర్ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు ఇద్దరూ హాజరయ్యారు. ఇక అల్ఫల్లాకు మొదటి సంతానం కాగా.. పాసినో నాలుగో సారి తండ్రవుతున్నాడు. అల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం. 33ఏళ్ల కుమార్తె జూలీ మేరీ, 22 ఏళ్ల కవలలు ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

