Viral Video: ఆషాడ మాసంలో అద్భుతం.. నీళ్లు తాగుతున్న వారాహి అమ్మవారు
దేవతలకు భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పాలు, పండ్లు, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అయితే విశాఖలో వారాహి అమ్మవారు నీరు తాగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.. ఈ షాకింగ్ ఘటన ఏపీ లోని విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో జరిగింది. ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా.. ఆ నీటిని అమ్మవారు తాగేశారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పలువురు అమ్మవారికి నీరు తాగించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

