Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక

Viral: తనను అమ్మేస్తున్న యజమానిని కౌగిలించుకుని బోరున ఏడ్చిన మేక

Phani CH

|

Updated on: Jul 16, 2022 | 9:38 AM

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. వాటికి భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. మాట్లాడలేనప్పటికీ తమను పెంచిన యజమానిని అమితంగా ప్రేమిస్తాయి.

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానులతో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. వాటికి భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. మాట్లాడలేనప్పటికీ తమను పెంచిన యజమానిని అమితంగా ప్రేమిస్తాయి. అంతేకాదు యజమాని నుండి వీడి వెళ్లిపోయే సమయంలో కొన్ని జంతువులు కన్నీరు పెట్టుకుంటాయి. మనుషుల వలె ఏడుస్తాయి కూడా. బక్రీద్ సందర్భంగా తనను అమ్మడానికి మార్కెట్ కు తెచ్చిన యజమానిని హత్తుకుని మనిషిలా బోరున ఏడ్చేసింది ఓ మేక. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. బక్రీద్ సందర్భంగా అమ్మేందుకు ఓ మేక ను మార్కెట్ లోకి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. మేకను అమ్మి.. డబ్బులు తీసుకున్నాడు. ఇలా ఒప్పందం జరుగుతున్న సమయంలో ఆ మేక తన యజమానిని హత్తుకుని బోరున ఏడ్చేసింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న స్తానికుల హృదయాలను కదిలించింది. యజమాని భుజంపై తల పెట్టి.. కన్నీరు పెట్టడం చూసి అక్కడున్నవారంతా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మేక యజమాని కూడా దానిని కౌగిలించుకున్నాడు. ఈ భావోద్వేగ సంఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మేక ప్రేమకు ఫిదా అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు

రెండు కిలోల బంగారు నగలు ధరించి మరీ ఫలుడా అమ్ముతున్న వ్యక్తి !!

పిచ్చి పీక్స్‌ చేరడమంటే ఇదేనేమో.. చివరికి అక్కడ కూడా టాటూ వేయించుకున్న యువతి !! టాటూల కోసం 2 కోట్లు ఖర్చు !!

Published on: Jul 16, 2022 09:38 AM