నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు

నాగ్‌పూర్‌లో విషాదం !! వంతెన దాటుతూ వరదలో కొట్టుకుపోయిన కారు

Phani CH

|

Updated on: Jul 16, 2022 | 9:36 AM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాహనానికి అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న వాహనంలో నుంచి బాధితులు..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాహనానికి అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న వాహనంలో నుంచి బాధితులు.. రక్షించాలంటూ కేకలు వేశారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని అక్కడున్న కొందరు ఫోన్లలో చిత్రీకరించగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నాగ్‌పూర్‌లోని సావ్నర్ తహసీల్‌ కేల్వాద్‌ దగ్గర నందా నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కారు కొట్టుకుపోయిందని.. ఈ ఘటనలో మహిళతోపాటు ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పూర్‌కు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా రెయిలింగ్ లేని బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తోంది. వాహనం వెళ్తుండగా.. వరదనీరు ముంచెత్తడంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు కిలోల బంగారు నగలు ధరించి మరీ ఫలుడా అమ్ముతున్న వ్యక్తి !!

పిచ్చి పీక్స్‌ చేరడమంటే ఇదేనేమో.. చివరికి అక్కడ కూడా టాటూ వేయించుకున్న యువతి !! టాటూల కోసం 2 కోట్లు ఖర్చు !!

Published on: Jul 16, 2022 09:36 AM