Gaza: గాల్లో పసి ప్రాణాలు.. ఒక్కసారి కరెంట్ ఆగితే ఘోరమే..! బందీలను విడిచిపెట్టాకే విద్యుత్
ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్‌ఐసీయూ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనే మంది శిశువులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులను కాపాడుకోలేమన్నది డాక్టర్ల మాట.
ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్‌ఐసీయూ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనే మంది శిశువులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులను కాపాడుకోలేమన్నది డాక్టర్ల మాట. అల్- షిఫా ఆస్పత్రి జనరేటర్లలో ఇంధనం నిండుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అలీ ఖుద్రా తెలిపారు. ఇంక్యుబేటర్లు సహా అత్యంత అవసరమైన వాటికి మాత్రమే ఇంధనాన్ని వినియోగిస్తున్నామని, అది ఎంత సమయం పాటు వస్తుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాలు తక్షణం తమకు ఇంధన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు పెట్రోల్ బంకులను సైతం ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఇంధనాన్ని విరాళంగా ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ భీకర దాడుల కారణంగా పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 5,087మంది పాలస్తీనా పౌరులు మృతిచెందినట్టు గాజా అధికారులు తెలిపారు. వీరిలో 2,055 మంది చిన్నారులు, 1,119 మంది మహిళలే ఉన్నారన్నారు. మరోవైపు 15వేల మందికి పైగా పౌరులు గాయపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..