Ganga Bridge: గంగా నదిపై కూలిన మరో వంతెన.! బీహార్‌లో నెల వ్యవధిలో మూడో ఘటన..
బీహార్ లో తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన కూలిపోయింది. వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెనలోని కొంత భాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా వంతెన కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
బీహార్ లో తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన కూలిపోయింది. వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెనలోని కొంత భాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా వంతెన కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న కొందరు చిక్కుకుపోయారు. నిజానికి జూన్ 20 నాటికి వంతెనను కూల్చివేయాల్సి ఉండగా.. కానీ అది జరగలేదు. తాజాగా వంతెన కూలిపోయిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు వెల్లడించారు. బీహార్లో నెల రోజుల వ్యవధిలోనే ఇది మూడో ఘటన. ఖగడియా జిల్లా భగల్ పూర్ లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. ఆ తర్వాత కిషన్ గంజ్ జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

