కోరిక తీరాలంటే ఆ దేవునికి అరటి గెల సమర్పించాల్సిందే !!

|

Feb 26, 2024 | 8:01 PM

దేవుళ్లు, దేవతలకు భక్తులు వివిధ రకాల మొక్కలు మొక్కుతూ ముడుపులు కడతారు. విశేష పర్వదినాల్లో ఆయా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలో నూ ఊయలలు కట్టడం చూస్తుంటాం. అలాగే కొన్ని ఆలయాలలో పూర్ణఫలం నారికేళాన్ని ముడుపుగా సమర్పిస్తారు. ఒక్కో ఆయలంలో ఒక్కో విశిష్ఠత ఉంటుంది. కొన్నిచోట్ల సంతానం కోరుతూ మొక్కలు కొబ్బరి మొక్కలు, గులాబీ మొక్కలు నాటుతారు.

దేవుళ్లు, దేవతలకు భక్తులు వివిధ రకాల మొక్కలు మొక్కుతూ ముడుపులు కడతారు. విశేష పర్వదినాల్లో ఆయా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలో నూ ఊయలలు కట్టడం చూస్తుంటాం. అలాగే కొన్ని ఆలయాలలో పూర్ణఫలం నారికేళాన్ని ముడుపుగా సమర్పిస్తారు. ఒక్కో ఆయలంలో ఒక్కో విశిష్ఠత ఉంటుంది. కొన్నిచోట్ల సంతానం కోరుతూ మొక్కలు కొబ్బరి మొక్కలు, గులాబీ మొక్కలు నాటుతారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అరటి గెలల జాతర నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి అరటిగెల సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతిఏటా మాఘశుద్ధ భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ అరటిగెలల జాతర నిర్వహిస్తారు. ఈ పండుగ మూడు రోజుల పాటు కొనసాగుతోంది. గత 80 ఏళ్లుగా చెట్ల తాండ్ర గ్రామములో ఈ ఆచారం కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా భీష్మ ఏకాదశి సందర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వివిధ ప్రత్యేక పూజలతో, సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా,చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందలమందికి అస్వస్థత.. రోడ్డు పైనే వైద్యం..

విదేశాల్లో చదవుకోవాలా ?? ఇది మీకో బంపర్‌ ఆఫర్‌ !!

ఐఫోన్ యూజర్స్ కు యాపిల్ వార్నింగ్..

ఒంటె కన్నీరుతో విషానికి విరుగుడు.. దుబాయ్‌లో శాస్త్రవేత్తల పరిశోధనలు

‘మ్యావ్ మ్యావ్‌’ పట్టివేత.. ఆ డ్రగ్ మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు !!