Viral Video: దోశను అలూ మసాలతోనే చేయాలా.? ఫ్రూట్స్‌తో చేయకూడదా.. ఈ కొత్తరకం రెసిపీపై ఓ లుక్కేయండి..

Viral Video: సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక వేదిక దొరికింది. తమలోని రకరకాల ట్యాలెంట్‌లను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సాంగ్‌, డ్యాన్స్‌ చివరికి వంటకాల ద్వారా కూడా పాపులర్‌ అవుతున్నారు...

Viral Video: దోశను అలూ మసాలతోనే చేయాలా.? ఫ్రూట్స్‌తో చేయకూడదా.. ఈ కొత్తరకం రెసిపీపై ఓ లుక్కేయండి..

Updated on: Mar 20, 2022 | 7:52 PM

Viral Video: సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక వేదిక దొరికింది. తమలోని రకరకాల ట్యాలెంట్‌లను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సాంగ్‌, డ్యాన్స్‌ చివరికి వంటకాల ద్వారా కూడా పాపులర్‌ అవుతున్నారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని సరికొత్త వంటకాలకు నెటిజన్లకు పరిచయం చేస్తున్నారు. అసలు ఊహకు కూడా అందని వంటకాలను తయారు చేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సాధారణంగా మసాల దోశను ఎలా తయారు చేస్తారు.? అదేం ప్రశ్న, ఆలూ కుర్మతోనేగా చేసేదని అంటారా.. మరి మసాలా స్థానంలో పండ్లను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది.? పండ్లతో దోశ ఏంటని.. ఆశ్చర్యపోతున్నారు కదూ.! కానీ మీరు చదివింది నిజమే. పండ్లతో చేసిన దోశ ఇప్పుడు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా అన్ని దోశలను చేసేట్లే ముందు పెనంపై పిండి వేశాడు.

తర్వాత అందులో అరటి నుంచి మొదలు, ఆపిల్‌, గ్రేప్స్‌ వంటి ఫ్రూట్స్‌ను వేశాడు. అనంతరం క్రీమ్‌, కెచప్‌ వేయడంతో ఈ సరికొత్త దోశ రడీ అయ్యింది. ఇలా తయారు చేసిన ఈ డిఫ్రెంట్‌ రెసిపీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. చూడడానికి అయితే బాగుంది.. మరి తినడానికి ఎలా ఉంటుందో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Gannavaram Politics: గన్నవరంలో వేడెక్కిన రాజకీయం.. ఒరిజినల్‌ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య ఫైట్!

KTR US Tour:పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. ఘనస్వాగతం పలికిన ప్రవాసీలు

Hyderabad Rains: భాగ్యనగర వాసులను పకరించిన వరుణుడు.. చల్లబడిన నగరం.. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం