Water-Soil on Moon: చందమామపై నివాసానికి నీరు, ఆక్సిజన్ కు ఇక కొరత లేనట్టే.!

Updated on: Aug 28, 2024 | 7:22 PM

చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలు అల్లారు. కొన్నాళ్ల కిందట ఆ జాబిలిపైనే అడుగుపెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దాటి.. చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి.. మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు కాని..

చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలు అల్లారు. కొన్నాళ్ల కిందట ఆ జాబిలిపైనే అడుగుపెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దాటి.. చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి.. మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు కాని.. దాని పైన ఉండే మట్టి నుంచి వాటర్ ని తయారుచేయడం కూడా సాధ్యమేనని ఇప్పుడు నిరూపించారు. అసలే.. భూమిపై వాటర్ సోర్స్ తగ్గిపోతున్న సమయంలో.. ఈ న్యూస్ చాలా కీలకమైనదే. ఇంతకీ చంద్రుడిపై ఉన్న మట్టి నుంచి వాటర్ ను ఎలా బయటకు తీశారు? దీనికోసం చైనా శాస్త్రవేత్తలు అనుసరించిన మార్గమేంటి? ఇప్పుడీ ప్రయోగం సక్సెస్ అయ్యింది కనుక.. జాబిలిపై నివాసముండడానికి మార్గం సుగుమం అయినట్టేనా? ఈ రిజల్ట్.. భవిష్యత్ ప్రయోగాల తీరుతెన్నులను ఎలా మార్చనుంది? CAS – చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడగొట్టవచ్చు CAS – చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. CASలోని నింగ్ బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేశారు. చాంగ్ ఈ-5 మిషన్ లో భాగంగా చంద్రుడిపై మట్టిని భూమికి తీసుకువచ్చారు....