Water-Soil on Moon: చందమామపై నివాసానికి నీరు, ఆక్సిజన్ కు ఇక కొరత లేనట్టే.!

చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలు అల్లారు. కొన్నాళ్ల కిందట ఆ జాబిలిపైనే అడుగుపెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దాటి.. చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి.. మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు కాని..

Water-Soil on Moon: చందమామపై నివాసానికి నీరు, ఆక్సిజన్ కు ఇక కొరత లేనట్టే.!

|

Updated on: Aug 28, 2024 | 7:22 PM

చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. చందమామపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జాబిలి చుట్టూ కథలు అల్లారు. కొన్నాళ్ల కిందట ఆ జాబిలిపైనే అడుగుపెట్టారు. అక్కడ నీటి జాడను కనుగొన్నారు. భారీగా ఖనిజాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దాటి.. చైనా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. చంద్రుడి మీదున్న మట్టి నుంచి నీటిని ఉత్పత్తి చేసి.. మరో కొత్త సంగతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని తెలుసు కాని.. దాని పైన ఉండే మట్టి నుంచి వాటర్ ని తయారుచేయడం కూడా సాధ్యమేనని ఇప్పుడు నిరూపించారు. అసలే.. భూమిపై వాటర్ సోర్స్ తగ్గిపోతున్న సమయంలో.. ఈ న్యూస్ చాలా కీలకమైనదే. ఇంతకీ చంద్రుడిపై ఉన్న మట్టి నుంచి వాటర్ ను ఎలా బయటకు తీశారు? దీనికోసం చైనా శాస్త్రవేత్తలు అనుసరించిన మార్గమేంటి? ఇప్పుడీ ప్రయోగం సక్సెస్ అయ్యింది కనుక.. జాబిలిపై నివాసముండడానికి మార్గం సుగుమం అయినట్టేనా? ఈ రిజల్ట్.. భవిష్యత్ ప్రయోగాల తీరుతెన్నులను ఎలా మార్చనుంది?

CAS – చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడగొట్టవచ్చు

CAS – చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. CASలోని నింగ్ బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన సైంటిస్టులు ఈ విషయంలో ముందడుగు వేశారు. చాంగ్ ఈ-5 మిషన్ లో భాగంగా చంద్రుడిపై మట్టిని భూమికి తీసుకువచ్చారు. తరువాత దీనిని బాగా వేడి చేశారు. ఆ తరువాత ఈ మట్టి నుంచి నీటిని వెలికితీయడానికి స్పెషల్ మెథడ్ ను ఉపయోగించారు. ఈ ప్రయోగంలో తేలింది ఏంటంటే.. 500 లీటర్ల నీటిని తయారుచేయాలంటే.. ఒక టన్ను మట్టి కచ్చితంగా అవసరం. అయితే ఈ ప్రయోగంలోనే సైంటిస్టులకు మరో విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. జాబిలి నుంచి తీసుకువచ్చిన మట్టి నుంచి తయారుచేసిన నీటిని.. అటు హైడ్రోజన్, ఇటు ఆక్సిజన్ గా విడగొట్టవచ్చు. దీంతో చంద్రుడిపై ఉన్న మట్టిపై శాస్త్రవేత్తలు పూర్తిగా దృష్టి సారించారు. భూమి తరువాత అంతటి నివాసయోగ్యమైన గ్రహం కోసం ఎప్పటి నుంచో అన్వేషణ జరుగుతోంది. భూమికి దగ్గరగా ఉండేవాటిపైనా ఫోకస్ పెట్టారు. అక్కడ నీటి నిల్వలు ఉంటేనే మానవ మనుగడ సాధ్యం. అందుకే ఇప్పుడీ ప్రయోగం కొత్త ఆశలు పుట్టిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బ్రెయిన్‌ స్ట్రోక్‌కు అదీ కారణమే... పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
బ్రెయిన్‌ స్ట్రోక్‌కు అదీ కారణమే... పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
పితృదోషం తొలగిపోవడానికి ఈ తీర్ధంలో పిండ ప్రదానంతో విశేష ఫలితం
పితృదోషం తొలగిపోవడానికి ఈ తీర్ధంలో పిండ ప్రదానంతో విశేష ఫలితం
వీకెండ్‌కి ఇలా చిల్‌ అవ్వండి.. రూ. 800కే టూర్ ప్యాకేజీ
వీకెండ్‌కి ఇలా చిల్‌ అవ్వండి.. రూ. 800కే టూర్ ప్యాకేజీ
కిచెన్‏లో కొత్త రూల్.. సైకోగాళ్లు అంటూ తిట్టిన అభయ్..
కిచెన్‏లో కొత్త రూల్.. సైకోగాళ్లు అంటూ తిట్టిన అభయ్..
సంతానం కోసం 8 ఏళ్లుగా దంపతుల ఎదురుచూపు.. దేవుడిచ్చిన వరం ఏమిటంటే
సంతానం కోసం 8 ఏళ్లుగా దంపతుల ఎదురుచూపు.. దేవుడిచ్చిన వరం ఏమిటంటే
కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్‌ మార్కులతో ఎంపిక
కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్‌ మార్కులతో ఎంపిక
జుట్లు పట్టుకుని కొట్టుకున్న లేడీ కంటెస్టెంట్స్.. పృథ్వీ బూతులు..
జుట్లు పట్టుకుని కొట్టుకున్న లేడీ కంటెస్టెంట్స్.. పృథ్వీ బూతులు..
ఈ అమ్మడి కోసం కుర్రాళ్ళు పడిచచ్చిపోతారు..
ఈ అమ్మడి కోసం కుర్రాళ్ళు పడిచచ్చిపోతారు..
ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌
ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌
కేరళను వణికిస్తున్న మంకీపాక్స్‌.. సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్
కేరళను వణికిస్తున్న మంకీపాక్స్‌.. సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్