బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

Updated on: Feb 27, 2025 | 1:58 PM

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫ్రీ చికెన్ మేళాలు నిర్వహిస్తూ మాంసాహార ప్రియుల్లో నిలకొన్న భయాందోళనలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏలూరు జిల్లాలో పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చికెన్, గుడ్లతో వివిధ రకాల వంటలు వండి స్థానికులకు వడ్డించారు. చికెన్, గుడ్లు తినేవారు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని సూచించారు. అపోహల మాని చికెన్, గుడ్లు తినవచ్చని అవగాహన కల్పించారు. చికెన్ గుడ్ల వంటకాన్ని తినేందుకు మాంసాహార ప్రియులు బారులు తీరారు. కొద్ది రోజులుగా ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. దీంతో చికెన్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఈ నేపథ్యంలో నిర్వహించిన చికెన్ మేళాకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఇటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేందుకు పౌల్ట్రీ కంపెనీలు రంగంలోకి దిగాయి. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో ఉచిత చికెన్ ఎగ్ మేళాను నిర్వహించారు. బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉడికించిన చికెన్ గుడ్లు తింటే వైరస్ చచ్చిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని చెబుతున్నారు. మేము తింటున్నాం, మీరు తినండి అంటూ చికెన్ ఎగ్స్‌లను ఉడికించి ఉచితంగా పంపిణీ చేశారు. ఇక ఉచితమనడంతో మాంసాహార ప్రియులు భారీగా తరలివచ్చి ఎగబడి తిన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో

ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్​లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..

కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..

వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?