Dance in Water: మీరు నీటి అడుగున ఆక్సిజన్ లేకుండా నడవగలరా? కానీ, ఏకంగా డ్యాన్స్ చేసిందీ భామ! Viral Video

|

Apr 21, 2021 | 4:21 PM

కళ.. ఏదైనా కానీయండి.. దానిని నేర్చుకోవడం ఒక ఎత్తయితే.. దానిలో కొత్తదనాన్ని ఆవిష్కరించడం మరో ఎత్తు. మనకి ఎన్నో రకాల నృత్య రీతులు ఉన్నాయి. దేని పద్ధతి దానిదే. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది.

Dance in Water: మీరు నీటి అడుగున ఆక్సిజన్ లేకుండా నడవగలరా? కానీ, ఏకంగా డ్యాన్స్ చేసిందీ భామ! Viral Video
Dance In Water
Follow us on

Dance in Water: కళ.. ఏదైనా కానీయండి.. దానిని నేర్చుకోవడం ఒక ఎత్తయితే.. దానిలో కొత్తదనాన్ని ఆవిష్కరించడం మరో ఎత్తు. మనకి ఎన్నో రకాల నృత్య రీతులు ఉన్నాయి. దేని పద్ధతి దానిదే. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. డాన్స్ అనే కళ లో అన్నీ అంతర్భాగాలే. డాన్స్ మామూలుగా అందరూ చేస్తారు అంటే.. నేర్చుకున్న వారంతా. వాళ్ళు నేర్చుకున్నది ఒక వేదిక మీద తమదైన పద్ధతిలో చేసి ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి.. దానిలో కొన్ని ప్రత్యేకతలు చొప్పించే ప్రయత్నం చేస్తారు. మీరు డ్యాన్స్ ఎప్పుడైనా నీటిలో చేయడం చూశారా? నీటిలో డ్యాన్స్ ఏమిటి అనిపిస్తోంది కదూ. అసలు నీటిలో పూర్తిగా మునిగితే ఊపిరాడక చస్తాం. ఒకవేళ ఎదో ఆక్సిజన్ వంటివి పెట్టుకుంటే కొద్దిగా నీటిలో ఉండగలం కానీ కాలు చేయీ కదపాలంటేనే విపరీతమైన కష్టం. మరి డ్యాన్స్ అంటారేంటి అనుకుంటున్నారు కదూ. అవును, ఓ డ్యాన్సర్ నీటిలో డ్యాన్స్ చేసి అద్భుతం సృష్టించింది. దాదాపు మూడు నిమిషాల పాటు ఆమె డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ అంటే ఎదో కాలూ చేయీ కదిపేసి మమ అనిపించడం కాదు. వస్తున్న సంగీతానికి అనుగుణంగా.. రిథమిక్ గా వెరైటీ చూపిస్తూ ఆమె చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఫ్రాన్స్ కు చెందిన బాస్టియన్ సోలైల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ వీడియో నీటిలో 10 మీటర్ల అడుగున చిత్రీకరించారు. స్వేయ కొరియోగ్రాఫీతొ అరియాడినో హఫీజ్ ఈ డ్యాన్స్ చేసింది. నీటి అడుగుభాగంలో ఈ డ్యాన్స్ కోసం వారు ఎటువంటి ఆక్సిజన్ పరికరాలూ ఉపయోగించలేదు. ఈ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో యూనిట్ అంతా..120 సార్లు ఆ నీటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందట. చక్కటి లైటింగ్.. దానికి తగ్గ కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్.. చిన్న సెట్ నీటి అడుగుభాగాన ఏర్పాటు చేసి తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది చూసి తమ అనుభూతిని కామెంట్ రూపంలో చెబుతున్నారు.

నీటి అడుగున డ్యాన్స్ వీడియో ఇదే..

Also Read: Ramesh Pokhriyal: నాయకుల్లో కరోనా టెన్షన్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌కు పాజిటివ్..

Vaccine for Eighteen: పద్దెనిమిది ఏళ్లకు టీకా..అమూల్ టచ్ తో  ప్రచారం..అదిరింది అంటున్న నెటిజనం!