Wolfs in UP: ‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!

Wolfs in UP: ‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!

Anil kumar poka

|

Updated on: Sep 13, 2024 | 6:14 PM

ఉత్తరప్రదేశ్‌ లోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. వాటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ భేడియా’ కు మరో విజయం దక్కింది. మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులు మరొక తోడేలును బంధించారు. దీంతో స్థానికులను వణికిస్తోన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదు చిక్కినట్లయింది. బహరాయిచ్‌లోని హరబక్ష్‌ పూర్వ గ్రామంలోని ఘఘర నది సమీపంలో ఈ తోడేలు చిక్కిందని అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌ లోని బహరాయిచ్‌ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. వాటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ భేడియా’ కు మరో విజయం దక్కింది. మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులు మరొక తోడేలును బంధించారు. దీంతో స్థానికులను వణికిస్తోన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదు చిక్కినట్లయింది. బహరాయిచ్‌లోని హరబక్ష్‌ పూర్వ గ్రామంలోని ఘఘర నది సమీపంలో ఈ తోడేలు చిక్కిందని అధికారులు తెలిపారు. అంతకుముందు మరొకదాన్ని కూడా ఇక్కడే బంధించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గుంపులో ఇంకొకదాన్ని బంధించాల్సి ఉందని ప్రకటించారు. వీటివల్ల సుమారు రెండు నెలలుగా బహరాయిచ్‌లోని 35 గ్రామాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ జీవాల దాడుల్ని ‘వైల్డ్‌లైఫ్ డిజాస్టర్‌’గా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వన్యప్రాణుల వల్ల 10 మంది మృతి చెందారు. అందులో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ జీవాలను పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రంగురంగుల బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి.. వాటిని పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు ఉండే గుహలు, నదీ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్నారు. మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మాంసాహార జంతువైన తోడేలు మనుషులపై దాడి చేయదని ది ఇంటర్నేషనల్‌ వూల్ఫ్‌ సెంటర్‌ చెబుతోంది. అవి వాటికి సంబంధించిన పరిమిత ప్రదేశాల్లోనే సంచరిస్తాయని పేర్కొంది. అవి ఒకేసారి భారీగా తిని.. దీర్ఘకాలం వేటాడకుండా ఉంటాయని పేర్కొంది. 2002 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా కేవలం 26 తోడేలు దాడులు జరిగినట్లు నార్వేజియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచర్‌ రీసెర్చి లెక్కలు చెబుతున్నాయి. తోడేళ్లు జీవించే పరిమిత ప్రాంతాల్లోకి మనుషులు వెళ్లడంతో.. వాటి పరిధి తగ్గి అవి జనావాసాల్లోకి రావడం వల్లే దాడులు జరిగే అవకాశం ఉంది. తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌ ఆదేశించారు. అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.