పశువుల పాక నుంచి వింత శబ్దాలు..ఏంటా అని చూసిన రైతు షాక్‌!

|

Jul 13, 2024 | 2:18 PM

వర్షాలు మొదలయ్యాయి.. మూగప్రాణులు సేదదీరుతున్నాయి. మరోవైపు ఆహారం కోసం వనాలను వదిలి జనాల్లోకి వస్తున్నాయి. నాగుపాములు, కింగ్‌ కోబ్రాలు ఇళ్లలోకి, పశువుల పాకల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అనకాపల్లిలో ఓ రాచనాగు జనాలను పరుగులు పెట్టించింది. అనకాపల్లి జిల్లాలో భారీ రాచనాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది.

వర్షాలు మొదలయ్యాయి.. మూగప్రాణులు సేదదీరుతున్నాయి. మరోవైపు ఆహారం కోసం వనాలను వదిలి జనాల్లోకి వస్తున్నాయి. నాగుపాములు, కింగ్‌ కోబ్రాలు ఇళ్లలోకి, పశువుల పాకల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అనకాపల్లిలో ఓ రాచనాగు జనాలను పరుగులు పెట్టించింది. అనకాపల్లి జిల్లాలో భారీ రాచనాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. చీడికాడ మండలం తురువోలు శివారు బుడ్డవారి కల్లాలోని పశువుల పాకలోకి చొరబడింది ఈ భారీ కింగ్‌ కోబ్రా. పశువుల పాకను శుభ్రం చేసేందుకు వచ్చిన రైతు పశువుల పకాలోకి వెళ్తుండగా అతనికి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. తొంగి చూసేసరికి భారీ కింగ్‌ కోబ్రా దర్శనమిచ్చింది. భయంతో వెంటనే బయటకు పరుగెత్తాడు. వెంటనే అటవీ శాఖ అధికారులు, ఈస్టర్న్ ఘాట్ సొసైటీ కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన.. ఈస్టర్న్ ఘాట్స్ సొసైటీ ప్రతినిధులు అటవీ శాఖ సిబ్బంది కలిసి కింగ్ కోబ్రాను పట్టుకొన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పట్టుకున్న కింగ్ కోబ్రా ను అడవుల్లో విడిచిపెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బదిలీపై వెళ్తున్న గురువుకు అరుదైన గురు దక్షిణ !!

భార్యతో గొడవలు.. ఈ మధ్యలో నయా బ్యూటీ ఎంట్రీ…

Digital TOP 9 NEWS: వావ్‌..! 1000 కోట్ల కల్కి.. | బెస్ట్ యాక్టర్స్‌గా చరణ్‌, తారక్‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌

Follow us on