Criminal Reward: ఈ క్రిమినల్‌ ఆచూకి తెలిపిన వారికి.. రూ. 2లక్షలకు పైగా పారితోషకం..!

Updated on: Jun 26, 2022 | 9:50 PM

న్యూయర్క్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 52 ఏళ్ల వయస్సు ఉన్న మహిళను అనుసరిస్తూ... ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్‌వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు.


న్యూయర్క్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 52 ఏళ్ల వయస్సు ఉన్న మహిళను అనుసరిస్తూ… ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్‌వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు. దీంతో ఆమె స్టేషన్‌ పేవ్‌మెంట్‌కి గుద్దుకుని సబ్‌వే ట్రాక్‌లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు వెంటనే స్పందించి బాధిత మహిళకు సాయం అందించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఇలా తోసేసిన సమయంలో ట్రైన్‌ రాలేదు కాబట్టి పెనుప్రమాదం తప్పింది. అయితే అతడు ఇలా ఎందుకు ప్రవర్తించాడన్న విషయం తెలియదు కానీ.. ఆమెను ట్రాక్‌పై తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.పాపం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు 2లక్షల పారితోషకం ఇస్తామని ఓ బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 26, 2022 08:53 PM