Swiggy Boy: ఫుడ్‌ డెలివరీ చేస్తూ.. భవనంపైనుంచి దూకేసిన బోయ్‌.. ఏం జరిగిందంటే..? వీడియో వైరల్.

Updated on: Jan 22, 2023 | 9:45 AM

పుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. సోషల్‌ మీడియాలో వీళ్లమీద అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వస్తుంటాయి.. ఆకలి చంపుకొని మరీ వాళ్లు ఇతరుల కడుపునింపేందుకు వెళ్తారు. ఎండైనా, వానైనా సరే వీళ్లు మాత్రం

పుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. సోషల్‌ మీడియాలో వీళ్లమీద అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వస్తుంటాయి.. ఆకలి చంపుకొని మరీ వాళ్లు ఇతరుల కడుపునింపేందుకు వెళ్తారు. ఎండైనా, వానైనా సరే వీళ్లు మాత్రం డెలివరీ చేస్తూనే ఉంటారు.. అలాంటి ఓ కష్టజీవి..ఫుడ్‌ డెలివరీకి వచ్చి ఇంట్లో కుక్కను చూసి భయపడి మూడు అంతస్తుల భవనం మీద నుంచి దూకేశాడు.ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగింది.యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌ మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు.. ఎప్పటిలాగే ఆర్డర్‌ డెలివరీకీ వెళ్లాడు…జనవరి 11 రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 6లోని లుంబిని రాక్‌ క్యాసిల్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్థులో ఆర్డర్‌ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్‌ షపర్డ్‌ శునకం మొరుగుతూ రావడంతో భయపడిన రిజ్వాన్‌ మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన యజమాని శోభన వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు మహ్మద్‌ ఖాజా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 22, 2023 09:45 AM