చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
ఆరు నెలలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లంక గ్రామస్తులను వణికించిన మొసలి ఎట్టకేలకు పట్టుబడింది. భారీ వరదల్లో కొట్టుకువచ్చిన ఈ మొసలిని పట్టుకోవడానికి అటవీ శాఖ ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానిక మత్స్యకారుల వలకు చిక్కడంతో గ్రామస్తులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు మొసలిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించడంతో, ఆరు నెలల భయానికి తెరపడింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లంక గ్రామస్తులను గత ఆరు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన మొసలి ఎట్టకేలకు చిక్కింది. చేపల వేటకు వెళ్లిన స్థానిక జాలర్ల వలకు ఈ మొసలి చిక్కడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో సుమారు ఆరు నెలల క్రితం వచ్చిన భారీ వరదల సమయంలో ఈ మొసలి కొట్టుకువచ్చి స్థానిక నీటి గుంటల్లో తిష్టవేసింది. అప్పట్లో అటవీ శాఖ అధికారులు దీనిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు ప్రయత్నాలను విరమించుకోగా, పొలం పనులకు వెళ్లే రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీశారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి మొసలి తమపై దాడి చేస్తుందోనని ఆరు నెలలుగా భయం గుప్పెట్లో బతికారు. తాజాగా జాలర్లు చేపల వేట కోసం వలలు వేయగా, అందులో ఈ భారీ మొసలి చిక్కుకుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మొసలిని సురక్షితంగా బంధించారు. దానిని జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు తరలించారు. ఆరు నెలల తర్వాత మొసలి బంధీ కావడంతో అయినవిల్లి లంక రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరి.. చరిత్ర సృష్టించిన టీచర్
అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

