Cannes protest: కేన్స్ రెడ్ కార్పెట్‌పై మహిళలు .. స్మోక్ గ్రనేడ్లతో నిరసన..! ఎందుకో తెలుసా..?
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొన్న ఓ మహిళ ఉక్రెయిన్‌కు మద్దతుగా రెడ్ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఆదివారం మహిళలు రెడ్ కార్పెట్‌పై రచ్చ చేశారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొన్న ఓ మహిళ ఉక్రెయిన్‌కు మద్దతుగా రెడ్ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఆదివారం మహిళలు రెడ్ కార్పెట్‌పై రచ్చ చేశారు. పదుల సంఖ్యలో మహిళలు నల్ల దుస్తులు ధరించి బ్యానర్లు చేతబట్టి నిరసన తెలిపారు. స్మోక్ గ్రెనేడ్లు ప్రయోగించి, ఆ ప్రాంతమంతా పొగకమ్ముకొనేలా చేశారు. అనేకమంది మహిళల పేర్లు రాసిఉన్న బ్యానర్లును ప్రదర్శించారు. ఆ పేర్లు ఫ్రాన్స్‌లో గృహహింస కేసుల్లో పురుషుల చేతిలో హత్యకు గురైన పలువురి మహిళలవని తెలుస్తోంది. మహిళ హత్యల నేపథ్యంలోనే తెరకెక్కిన చిత్రం హోలీ స్పైడర్ ప్రీమియర్ ప్రదర్శించే సమయంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఉక్రెయిన్‌పై యుద్ధం పేరుతో అక్కడి మహిళలపై రష్యా సైనికులు సాగిస్తోన్న అకృత్యాలను నిరసిస్తూ శుక్రవారం ఓ మహిళ కేన్స్‌లో ఆందోళనకు దిగింది. రెడ్ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆమెకు దుస్తులు కప్పి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

