crazy video: క్రేజీ ప్లాన్‌..ఇష్టపడ్డ కొత్త బైక్ కోసం ఏం చేశాడంటే..! షాక్ తిన్న షోరూమ్ సిబ్బంది..

|

May 02, 2022 | 9:24 AM

టు వీలర్ ని ఇష్టపడని యువకులు ఎవరుంటారు చెప్పండి. పైగా నేటి కుర్రకారు ఏదైనా కొత్తగా చేయాలని భావిస్తుంటారు..అలాగే విశాఖకు చెందిన ఓ యువకుడి కలల వాహనం..హీరో ఎక్స్‌పల్స్‌ 200 స్పోర్ట్స్‌ బైక్‌..!


టు వీలర్ ని ఇష్టపడని యువకులు ఎవరుంటారు చెప్పండి. పైగా నేటి కుర్రకారు ఏదైనా కొత్తగా చేయాలని భావిస్తుంటారు..అలాగే విశాఖకు చెందిన ఓ యువకుడి కలల వాహనం..హీరో ఎక్స్‌పల్స్‌ 200 స్పోర్ట్స్‌ బైక్‌..! ఎలాగైనా కొనాలని తపించాడు. మామూలుగా కొంటే మజా ఏముంటుందని… కొత్తగా ఆలోచించాడు. వినూత్న ప్రయత్నంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన సింహాద్రి అందరి కుర్రాళ్లలాగే బైక్ మీద మనసు పడ్డాడు. రెండేళ్ల కిందట నుండి బైక్ కి కావలసిన డబ్బులు సమకూర్చుకునే పనిలోపడ్డాడు. మొత్తానికి డబ్బులు సంపాదించాడు. అయితే అందరిలాగ షోరూమ్ కి వెళ్లామా, డబ్బులిచ్చి బైక్ తెచ్చుకున్నామా అన్నట్టు కాకుండా బైక్ ధర 1 లక్ష 60వేల విలువ చేసే రూపాయిలను కేవలం కాయిన్స్ రూపంలోనే చెల్లించి షో రూమ్ వారికి షాక్ ఇచ్చాడు. సింహాద్రి- బైక్ కొనుగోలు చేసిన వ్యక్తిఈ లక్షా అరవై వేల రూపాయలకు సమానంగా రూపాయి కాయిన్స్ సేకరించేందుకు అతగాడు దాదాపు 3 నెలలు శ్రమపడ్డాడు. లక్షా ముప్పై వేల రూపాయిల కాయిన్లను విశాఖ నగరంలోని వివిధ బ్యాంకుల నుంచి సేకరించగా, మిగిలిన 30 వేల రూపాయిల కాయిన్స్ ఇంటినుండి తెచ్చాడు. ఇక కాయిన్స్ చెల్లించి బైక్ తీసుకువెళ్లాలన్న కాన్సెప్ట్ పై మొదట షోరూమ్ వారు నిరాకరించినా, సింహాద్రి తనకి వున్న కోరికను వారికి చెప్పి ఒప్పంచటంతో చివరకు అంగీకరించారు.మొత్తానికి కొత్త బైక్ ని కొన్న ఆనందం సింహాద్రి సొంతమైతే వచ్చిన కాయిన్స్ ని లెక్క పెట్టటంలో ఇబ్బందులు పడ్డారు షోరూ నిర్వాహకులు. లక్ష 60 వేల రూపాయిలను 10 మ౦ది సిబ్బంది ఆరు గ౦టల పాటు శ్రమి౦చి లెక్క కట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..