Viral Video: పక్షులను భయపెడుతున్న దెయ్యం బొమ్మ.. వీడియో

Viral Video: పక్షులను భయపెడుతున్న దెయ్యం బొమ్మ.. వీడియో

Phani CH

|

Updated on: Oct 15, 2021 | 10:04 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవీ జంతువులు, పక్షుల బారీ నుండి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవీ జంతువులు, పక్షుల బారీ నుండి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు. దీనికి గాను ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు , ఒక స్ప్రింగ్ తో జోడించిన సైకిల్ హాండీల్ ఉపయోగించాడు. డబ్బాకు ఓ పాత అంగిని తొడిగి బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశారు. గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ అటు ఇటూ ఊగుతుంది. దీంతో పంటలపై వాలే పక్షులు, అటవి జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా వెళ్ళి పోతున్నాయి. దీనికి కేవలం 900 రూపాయలు మాత్రమే ఖర్చయిందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి వస్తే తాను తయారు చేసి ఇస్తానని చెపుతున్నాడు యువరైతు సాయికిరణ్.

 

మరిన్ని ఇక్కడ చూడండి: నెల్లూరు నగరంలోని లస్సీ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. మొబైల్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్.. వీడియో

Viral Video: వినాయకుడే పుట్టాడంటూ..! ఊరిజనం పూజలు.. వీడియో

Published on: Oct 15, 2021 09:52 AM