వ్యాపారులకు దొంగబాబాల బురిడీ.. పౌడర్‌ చల్లి.. డబ్బుతో పరార్‌

Updated on: Oct 25, 2025 | 11:16 AM

ఆధునిక యుగంలోనూ మంత్రాలు, యంత్రాలు, క్షుద్రపూజలు అంటూ మూఢనమ్మకాలను వీడటం లేదు ప్రజలు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రోజుకో బాబా పుట్టుకొస్తూ ప్రజలను తమదైనశైలిలో మోసం చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లాలో నలుగు దొంగ బాబాలు హల్చల్‌ చేశారు. దుకాణాలకు వెళ్లి వ్యాపారంబాగా జరిగేందుకు తాము మంత్రాలు వేస్తామంటూ దుకాణదారుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిపై పౌడర్‌ చల్లి పారిపోయారు.

జనగమ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో వ్యాపారులే టార్గెట్‌గా మంత్రాల పేరుతో మాయ చేస్తున్నారు నలుగురు బాబాలు. స్థానిక దుకాణాలకు వెళ్లి, షాపులో దోషాలు ఉన్నాయని, వాటివల్ల అరిష్టమని, వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతారని వారికి మాయమాటలు చెప్పి, తాము దోషాలు పోడానికి ప్రత్యేక పూజలు చేస్తామని, దాంతో వ్యాపారం లాభసాటిగా సాగుతుందని చెప్పారు. దుకాణంలో నరదృష్టి, వాస్తు దోషాలు, నెగటివిటీ పోవాలంటే శాంతి పూజ చేయించాలని నమ్మబలికారు. అందుకు కొంత ఖర్చవుతుందని, అది చెల్లిస్తే తాము పూజలు చేస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన వ్యాపారులు వారికి కొంత నగదు ఇచ్చారు. నగదు తీసుకొని వారిపై ఒకరకమైన పౌడర్‌ను తీసుకొని మంత్రించి వారిపై చల్లి, ఓ పేపర్లో కాస్త విభూది, ఓ రుద్రాక్ష పెట్టి ఇచ్చి, అక్కడినుంచి ఉడాయించారు. అనుమానం వచ్చిన వ్యాపారులు వారిని అనుసరించారు. వేరే దుకాణాల్లో కూడా అదే స్టోరీ చెప్పి డబ్బు తీసుకొని కారులో పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఆ నలుగురు దొంగబాబాలను పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. ఇలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

అమెరికా విద్యార్థి వీసా రూల్స్ మరింత కఠినం.. భారత విద్యార్థులకు ఇబ్బందే

సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ

ఛీ.. శవం చేతి బంగారు కడియాన్నివదలని హాస్పిటల్ సిబ్బంది

ఈ లేడీ జేమ్స్ బాండ్’రూటే సపరేటు