Eye Bleeding: పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు.? కళ్ల నుండి రక్తం దార.

|

Sep 02, 2024 | 10:48 AM

పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్‌ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్‌ఎఫ్‌ (క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్‌ బారినపడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతోంది. ప్రస్తుతం వైద్యులు ఆ బాలునికి చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ ను నివారించడం చాలా కష్టం. దీనికి చికిత్స కూడా అంత ఈజీ కాదు. ఐ బ్లీడింగ్‌ వైరస్‌ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్‌లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. టిక్‌ కాటు ద్వారా ఈ వైరస్‌ వృద్ధి చెందుతుంది. టిక్‌ అంటే పేలు తరహాలో ఉండే పరాన్న జీవి. ఇక ఈ వైరస్ తల్లి నుండి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది.

సీసీహెచ్‌ఎఫ్‌ వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ సోకినప్పుడు అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స గానీ, వ్యాక్సిన్‌ గానీ అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్‌లో ఉంచి, వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఈ వైరస్‌ సోకినవారిలో 50 శాతం మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం, వ్యాధి ఆనవాళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా దీని వ్యాప్తిని కొంతవరకూ నివారించవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.