Trending Video: చావులోనూ వీడలేదు.. గుండెను హత్తుకుని తుదిశ్వాస విడిచింది..! ఎమోషనల్ వీడియో.
ప్రేమ.. రెండక్షరాలే అయినా దానిని వర్ణించడం ఎవరితరం కాదు. ఈ ప్రేమ మనుషుల్లోనే కాదు.. ప్రతి జీవరాశిలోనూ చిగురిస్తుంది. జంతువులు, పక్షులు సైతం తమ భాగస్వామిని ప్రేమిస్తాయి. రెండు హృదయాలను కలిపే ప్రేమ.. ఆ హృదయ స్పందన ఆగినప్పటికీ అమరంగా నిలుస్తుంది.
ప్రేమ.. రెండక్షరాలే అయినా దానిని వర్ణించడం ఎవరితరం కాదు. ఈ ప్రేమ మనుషుల్లోనే కాదు.. ప్రతి జీవరాశిలోనూ చిగురిస్తుంది. జంతువులు, పక్షులు సైతం తమ భాగస్వామిని ప్రేమిస్తాయి. రెండు హృదయాలను కలిపే ప్రేమ.. ఆ హృదయ స్పందన ఆగినప్పటికీ అమరంగా నిలుస్తుంది. అందుకే అంటారు ప్రేమ అమరం, అజరామరం అని. అందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెను పిండేస్తున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కన్నీరుపెడుతున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఓ పక్షి చనిపోయి పడిఉంది. ఆ పక్షి పక్కనే మరో పక్షి మూగగా రోదిస్తూ, బాధతో నిల్చుంది. చనిపోయిన పక్షి తలపై తన తలపెట్టి విలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి ఓ వ్యక్తి చనిపోయిన పక్షిని కాస్త పక్కకు జరిపాడు. అయినా ఆ పక్షి తన జంట పక్షిని అస్సలు వీడటం లేదు. మళ్లీ చనిపోయిన పక్షి వద్దకు వచ్చి దాని గుండెలపై తల వాల్చింది. అలా తల వాల్చిన పక్షి.. అక్కడే.. ఆ క్షణమే తన తుదిశ్వాస విడిచింది. ఈ దృశ్యం చూపరుల మనసును పిండేస్తోంది. తన భాగస్వామి లేనిదే తాను ఉండలేననుకుందో ఏమో.. ఆ పక్షి సైతం ప్రాణాలు విడిచింది. ఈ రెండు ప్రేమ పక్షులను సదరు వ్యక్తి ఒకే చోట ఖననం చేశాడు. కన్నీరు పెట్టిస్తున్న వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంతనంద తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. నెటిజన్లు దీనిని చూసి తమ బాధను వ్యక్తం చేస్తూ ఏడుస్తున్నట్లు ఎమోజీలు పెడుతున్నారు. ఈ ప్రేమను వర్ణించలేమని, నిజమైన ప్రేమకు సజీవ సాక్ష్యం అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

