భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ వేధింపులు

Updated on: Nov 02, 2025 | 2:20 PM

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం వెలుగు చూసింది. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ చిన్నకోడలిని అత్తమామలు వేధిస్తున్నారు . బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని వేధించారు. ఆమె అంగీకరించకపోవటంతో గదిలో బంధించారు.పోలవరానికి చెందిన అమృతవల్లికి జంగారెడ్డిగూడెంకి చెందిన రంజిత్ కుమార్‌తో వివాహం జరిగింది.

వీరికి ఏడాది బాబు ఉన్నాడు. అయితే బాధితురాలి భర్త అన్న అయిన ప్రవీణ్‌కు వివాహం జరిగి ఎనిమిది ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో బావ ప్రవీణ్‌కు పిల్లలను కనివ్వాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అంగీకరించకపోవడంతో నిర్భంధించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన చెల్లిని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. అయితే బాధితురాలి ఆరోపణలను అత్తమామలు ఖండిస్తున్నారు. తాము వేధించలేదని చెబుతున్నారు. బాధితురాలని వేధిస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, మహిళా సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు .

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌

కూరగాయల సాగుతో.. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నఅమ్మాయి

రన్నింగ్‌ రైలులో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన ప్రయాణికులు

విజువలైజేషన్ టెక్నిక్‌తో భయాలు దూరం

రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందే.. లేదంటే రూ లక్షల్లో ఫైన్‌!