బస్సు ప్రమాదం నుండి బిడ్డను రక్షించుకున్న తల్లి ఏనుగు.. ఏం చేసిందంటే..

Updated on: Sep 26, 2022 | 9:35 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాటిలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు మరింతగా ఆకర్షిస్తుంటాయి.

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాటిలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు మరింతగా ఆకర్షిస్తుంటాయి. అవి చేసే చిలిపి చేష్టలను నెటిజన్లు ఎంతగానో ఆస్వాదిస్తారు. తాజాగా ఓ రెండు ఏనుగులు తమ బిడ్డను ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా రక్షించుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ అటవీ ప్రాంతంలోని రహదారిపై రెండు ఏనుగులు తమ పిల్ల ఏనుగుతో కలిసి రోడ్డు దాడుతున్నాయి. ఈ క్రమంలో దూరం నుంచి ఓ బస్సు వస్తుంది. అది గమనించిన ఈ ఏనుగులు తమ బిడ్డకు రోడ్డు దాటడం తెలియక ఎక్కడ ఆ బస్సుకింద పడతుందోనని భయపడి పిల్ల ఏనుగును పక్కకు తీసుకెళ్ళి వాటి తొండాలతో ఆ చిన్ని ఏనుగు చుట్టూ కంచెలా ఏర్పాటు చేసి బస్సుకు దారిచ్చాయి. ఈ క్యూట్ వీడియోను సుధారామన్ తన ట్విట్టర్ పేజీలో షేర్‌ చేశారు. అందుకే ఏనుగులను జెంటిల్‌ జెయింట్స్‌గా పిలుస్తున్నారు అంటూ క్యూట్‌ క్యాప్షన్‌కూడా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో విపరీతమైన లైక్స్‌తో ట్రెండవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బతికున్న భార్యలకు పిండ ప్రదానం !! అసలు విషయం తెలిస్తే షాక్‌ !!

మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!

చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??

Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్‌..లైవ్ వీడియో

Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో

Published on: Sep 26, 2022 09:35 PM