చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??

సాధారణంగానే చిరుతలు చెట్లను ఈజీగా ఎక్కేస్తాయి. ఎక్కువ శాతం చెట్లపైనే సేద తీరుతాయి. తాజాగా జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత.. ఊరు చివరలో ఉన్న ఓ పెద్ద మామిడి చెట్టుపైకి ఎక్కింది.

చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??

|

Updated on: Sep 26, 2022 | 9:27 PM

సాధారణంగానే చిరుతలు చెట్లను ఈజీగా ఎక్కేస్తాయి. ఎక్కువ శాతం చెట్లపైనే సేద తీరుతాయి. తాజాగా జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత.. ఊరు చివరలో ఉన్న ఓ పెద్ద మామిడి చెట్టుపైకి ఎక్కింది. చెట్టుపై సేద తీరేందుకు ఏకంగా చిటారు కొమ్మకు వెళ్లింది. అక్కడ బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడింది. ముందుకు కదిలితే కిందపడతానేమోనని భయంతో అక్కడే ఉండిపోయింది. స్థానికులు దానిని గమనించి, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సిబ్బంది వచ్చి చిరుతను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాదాపు 8 గంటల పాటు శ్రమించి చిరుతను క్షేమంగా కిందకు దించారు ఫారెస్ట్ సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వణ్యప్రాణుల సంరక్షణ విభిన్న సవాళ్లతో కూడుకున్నదని ఆయన ట్విట్‌లో తెలిపారు. ప్రజల నుంచి చిరుతను రక్షించడానికి, చిరుత నుంచి ప్రజలను రక్షించేందుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత పైకి చిరుత ఎలా ఎక్కిందబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్‌..లైవ్ వీడియో

Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో

Follow us