ఏనుగును ఎత్తుకెళ్లడంపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
ఏనుగు ఏ విషయాన్నైనా మరిచిపోదనీ, దాని జ్ఞాపకశక్తి అమోఘం అంటారు. అయితే ఓ ఏనుగు వింత కథను ఇప్పట్లో ఎవరూ మర్చిపోయేలా లేరు. ఓ ఏనుగు కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది. ఈ కేసులో యూపీ, జార్ఖండ్, బీహార్ మూడు రాష్ట్రాల్లోని వ్యక్తుల నేరం బయటపడింది. తాను కొనుగోలు చేసిన ఏనుగును ఎత్తుకెళ్లారని శుక్లా అనే వ్యక్తి జార్ఖండ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తన ఏనుగు జయామతిని జార్ఖండ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలిస్తుండగా మావటివాడు దొంగిలించాడని అన్నాడు. ఏనుగులను పెంచే కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కోటి రూపాయలు విలువ చేసే ఏనుగును కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపాడు. ఏనుగు చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు బీహార్‌లో గోరఖ్ సింగ్ అనే వ్యక్తి దగ్గర ఆ ఆడ ఏనుగు ఉన్నట్లు తెలుసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా రూ.27 లక్షలకు దానిని కొన్నట్లు చెప్పాడు. దీంతో మావటివాడు ఆ ఏనుగును అతడికి అమ్మి ఉంటాడని పోలీసులు అనుమానించారు. మరోవైపు పోలీసులు మరింతగా దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. శుక్లాతో పాటు మరో ముగ్గురు కలిసి ఆ ఏనుగును జాయింట్‌గా రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు. అయితే శుక్లాను మినహాయించి ముగ్గురు భాగస్వాములు ఒక ఒప్పందం కుదుర్చుకుని బీహార్‌లోని వ్యక్తికి రూ. 27 లక్షలకు దానిని విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏనుగు కొనుగోలుకు సంబంధించిన పత్రాలను బీహార్‌లోని గోరఖ్ సింగ్ సమర్పించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీంతో మిగతా భాగస్వాములను కూడా ఏనుగు కొనుగోలు పత్రాలను సమర్పించాలని కోరినట్లు చెప్పారు. ఆ పత్రాలను ధృవీకరించిన తర్వాత చట్టపరంగా ఆ ఏనుగు అసలు యజయాని ఎవరన్నది నిర్ధారిస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు
Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

